39 ఏళ్ళ హీరోకు తల్లిగా త్రిష?


సౌత్ ఇండస్ట్రీలో సీనియర్ బ్యూటీలలో ఎక్కువ కాలం హీరోయిన్ బ్రాండ్ ను మెయింటైన్ చేసిన వారిలో త్రిష టాప్ లిస్ట్ లో ఉంటుంది అని చెప్పవచ్చు. వయసుతో సంభంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న నటి త్రిష కృష్ణన్ తన కొత్త సినిమా లియోతో అభిమానులను అలరించడానికి సిద్ధమవుతోంది. దళపతి విజయ్ నటించిన ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు.  ఇది అక్టోబర్ 19 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

ఇక ఇటీవల, రాబోయే చిత్రంలో త్రిష పాత్ర గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించే సినిమాలో ఆమె చిరంజీవి భార్యగా నటించవచ్చని ఒక టాక్ వస్తోంది. ఇక ఆ సినిమా శర్వానంద్ కు తల్లి తండ్రులుగా మెగాస్టార్ త్రిష నటిస్తారని తెలుస్తోంది. ఇప్పటివరకు ఆ తరహాలో కనిపించని త్రిష మొదటిసారి 39 ఏళ్ళ శర్వానంద్ కు తల్లిగా నటించే ఛాన్స్ ఉందట. ఇక త్రిష వయసు 40. అంటే ఒక సంవత్సరం మాత్రమే తేడా. ఇక ఈ చిత్రాన్ని చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల, పీపుల్స్ మీడియా వారితో కలిసి నిర్మిస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post