కార్తీ హిట్టు సినిమాకు సీక్వెల్!


కార్తీ బ్లాక్‌బస్టర్ చిత్రంకు సీక్వెల్ రానుంది.  గత ఏడాది జరిగిన సర్దార్ సినిమా సక్సెస్ మీట్‌లో దర్శకుడు PS మిత్రన్ ముందుగానే ఒక క్లారిటి ఇచ్చాడు.  సర్దార్ ముగింపు నుండి ఒక క్లిప్‌ను చూపిస్తూ.. ఇక ఆ కథను సర్దార్: పార్ట్ 2 లో కొనసాగించనున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు సీక్వెల్ గురించి తాజా అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

లేటెస్ట్ న్యూస్ ప్రకారం సీక్వెల్ యొక్క ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాదిలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఇక మేకర్స్ నుండి అధికారిక అప్‌డేట్ త్వరలో రానుంది. మేకర్స్ సర్దార్ 2 కోసం యువన్ శంకర్ రాజా సంగీతం ఇవ్వనున్నాడు. మొదటి భాగానికి జివి ప్రకాష్‌ సంగీత స్వరకర్తగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అతను బిజీగా ఉండడం వలన.. సర్దార్ 2లో జివి స్థానంలో యువన్ వచ్చినట్లు సమాచారం.

ఇక స్పై యాక్షన్ డ్రామాగా తెరపైకి వచ్చిన సర్దార్ అప్పట్లో తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ అయితే అందుకుంది. ఇక అందులో ద్విపాత్రాభినయం చేసిన కార్తీ పోలీస్ గా అలాగే గూఢచారిగా అబ్బురపరిచాడు. ఇక దర్శకుడు మిత్రన్ ఈసారి ఏ కోణంలో సెకండ్ పార్ట్ ను తెరపైకి తీసుకు వస్తాడో చూడాలి.

Post a Comment

Previous Post Next Post