గాండీవధారి - బెదురులంక.. మరీ ఇంత తక్కువనా?


ఈ శుక్రవారం రెండు డిఫరెంట్ సినిమాలు మేజర్ హైలైట్ గా నిలుస్తున్నాయి. మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన గాండీవదారి అర్జున యాక్షన్ ఫిలిం కాగా బెదురులంక 2012 డిఫరెంట్ కామెడీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ రెండు సినిమాలు కూడా మొదటి నుంచి పెద్దగా అనుకున్నంత స్థాయిలో పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేయలేకపోయాయి. 

ముఖ్యంగా బెదురులంక 2012 సినిమాకు ఒకరోజు ముందే ప్రీమియర్ షోలు ప్రదర్శించినప్పటికీ అనుకున్నంత స్థాయిలో అయితే పాజిటివ్ టాక్ అయితే ఏమీ రాలేదు. ఇక గాండీవదారి అర్జున అయితే ప్రమోషన్స్ తాకిడి కూడా రేంజ్ ను పెంచలేదు. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ ను గమనిస్తే అన్ని ప్లాట్ ఫామ్స్ లో కూడా రెండు సినిమాలకు పెద్దగా రెస్పాన్స్ అయితే ఏమి కనిపించడం లేదు. ఏదేమైనా కూడా శుక్రవారం రోజు కంటెంట్ క్లిక్ అయితేనే ఆడియన్స్ థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది. టాక్ ఏ మాత్రం తేడా వచ్చినా మొదటి రోజే రెండవ ఆటకు కలెక్షన్స్ మరింత డౌన్ అయ్యే అవకాశం ఉంది. చూడాలి మరి రెండింటిలో ఏది క్లిక్ అవుతుందో.

Post a Comment

Previous Post Next Post