మహేష్ ను వదలని తమన్!


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా మరికొన్ని రోజుల్లో ఒక సరికొత్త కొత్త షెడ్యూల్ తో స్పీడ్ పెంచబోతోంది. ఇప్పటికే ఆ షూటింగ్ కు సంబంధించిన స్పెషల్ సెట్ కూడా నిర్మించారు. అయితే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఒక పాటను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అది సాధ్యపడలేదు. మహేష్ బాబు తన బర్త్ డే సందర్భంగా కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. 

అయితే మహేష్ ఇండియాకు ఇటీవల తిరిగి వచ్చినప్పటి నుంచి కూడా సంగీత దర్శకులు రెగ్యులర్ టచ్ లో ఉంటున్నట్లుగా తెలుస్తోంది. తమన్ ఈ సినిమాకు మొదట ఇచ్చిన ట్యూన్స్ మహేష్ బాబును అంతగా ఇంప్రెస్ చేయలేదు. ఒక 50 కి పైగా ట్యూన్స్ రిజెక్ట్ చేయడం జరిగిందట. ఇక ఇప్పుడు ఫైనల్ గా మహేష్ బాబు కాస్త పాజిటివ్ గా రియాక్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ఫస్ట్ సాంగ్ విడుదల చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఇక రేపో మాపో ఫస్ట్ సాంగ్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.

Post a Comment

Previous Post Next Post