భోళా.. ఆమె రిజెక్ట్ చేయడంలో తప్పు లేదు


భోళా శంకర్ సినిమాలో కీర్తి సురేష్ చేసిన పాత్రకు మొదట సాయిపల్లవిని అనుకున్న విషయం తెలిసిందే. ఆ పాత్ర కోసం ప్రత్యేకంగా చిరంజీవి మొదట ఆమెనే సెలెక్ట్ చేసుకున్నారు. కానీ సాయి పల్లవి మెగాస్టార్ తో నటించే ఆఫర్ వచ్చినప్పటికీ కూడా ఆమె చాలా సున్నితంగానే దాన్ని రిజెక్ట్ చేసింది. అందుకు బలమైన కారణాలు కూడా చెప్పింది. నేను రీమేక్ సినిమాలు ఎట్టి పరిస్థితులలోను చేయను అని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లోనే అనుకున్నాను అని ఆమె వివరణ ఇచ్చేసింది.

అదే విషయాన్ని ఒక సినిమా ఈవెంట్లో కూడా ఆమె మెగాస్టార్ ఎదుటనే చాలా క్లుప్తంగా వివరణ ఇచ్చింది. ఇక భోళా శంకర్ సినిమా విడుదలైన తర్వాత కీర్తి సురేష్ పాత్రలో కూడా అంతగా బలం లేదు. అసలు ఆ స్క్రిప్ట్ అనేది వర్క్ అవుట్ కానిది. అది ఆమె బాగానే గ్రహించింది. అందుకే ఆమె రిజెక్ట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సాయి పల్లవి పేరు కూడా బాగానే వైరల్ అవుతుంది. ఆమె రిజెక్ట్ చేయడంలో ఎలాంటి తప్పులేదు అని కరెక్ట్ డిసిషన్ అని నెటిజన్లు భావిస్తున్నారు. ఇక భోళా శంకర్ సినిమా డిజాస్టర్ టాక్ తో కొనసాగుతోంది.

Post a Comment

Previous Post Next Post