సలార్, కల్కి.. ఫినిష్ అవ్వగానే ప్రభాస్ అక్కడికే ?


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పాన్ వరల్డ్ రేంజ్ లో సినిమాలు చేయాలని గట్టిగానే ప్రణాళికలు రచిస్తున్నారు. రాబోయే కల్కి సినిమా అంతకుమించి ఉంటుంది అని అంచనాలు అయితే పెంచేస్తున్నారు. కానీ అందుకు తగ్గ కంటెంట్ మాత్రం వదలడం లేదు. ఇక ప్రభాస్ సలార్ సినిమాపై అయితే అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ప్రశాంత్ నీల్ తెరపైకి తీసుకు వస్తున్న ఈ సినిమా తప్పకుండా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు.

ఇక ప్రభాస్ ఆ సినిమా విడుదల కాగానే అలాగే ప్రాజెక్టు K పనులు పూర్తవగానే ఇండియాలో ఉండడట. ఎందుకంటే గత కొంతకాలంగా మోకాలి నొప్పి గాయంతో ప్రభాస్ చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటికే కొన్ని సర్జరీలు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కానీ ప్రభాస్ షూటింగులు చాలా పెండింగ్ ఉండడంతో ఆ పనిని వాయిదా వేస్తూ వస్తున్నాడు. తప్పనిసరిగా కొన్ని నెలలపాటు రెస్ట్ తీసుకోవాలి కావున ఈ పనులన్నీ ముగించుకున్న తర్వాతనే విదేశాలకు వెళ్లి మోకాలి సర్జరీ చేయించుకోవాలని అనుకుంటున్నాడు.

Post a Comment

Previous Post Next Post