జైలర్.. ఇంకా అయిపోలేదు?


జైలర్ సినిమాతో తలైవా రజినీకాంత్ బాక్సాఫీస్ వద్ద చాలా రోజుల తర్వాత మంచి సక్సెస్ అయితే అందుకున్నారు. మొత్తానికి సినిమా సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేయబోతోంది అని మొదటి రోజే అర్థమయిపోయింది. రజినీకాంత్ స్టైల్ కు తగ్గట్టుగా ఈ మాత్రం కంటెంట్ ఇస్తే చాలు బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి అని దర్శకుడు నెల్సన్ ఒక ఉదాహరణ ఇచ్చాడు అని చెప్పవచ్చు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ క్లైమాక్స్ లో అయితే దర్శకుడు ఊహించిన విధంగానే ఒక మంచి ట్విస్ట్ అయితే ఇచ్చాడు. అయితే నెల్సన్ కూడా మల్టీవర్స్ తరహా లోనే కథలను కొనసాగించబోతున్నట్లు కూడా అనిపిస్తోంది. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి పాత్రలతో మంచి ట్విస్ట్ ఇచ్చిన దర్శకుడు భవిష్యత్తులో కథను కొనసాగించుకునే విధంగా ఒక లీడ్ అయితే తీసుకున్నాడు. ప్రస్తుతం చాలా మంది యువ దర్శకులు ఇదే తరహా ప్లాట్ తో మంచి కంటెంట్ క్రియేట్ చేసుకుంటున్నారు. మరి నెల్సన్ కూడా అదే తరహాలో మల్టీ వర్స్ తరహాలో ముందుకు సాగుతాడో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post