ప్రభాస్ లిస్టులో ఈ డైరెక్టర్ కూడానా?


ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమాను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అలాగే మరోవైపు మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ప్రాజెక్ట్ K కూడా షూటింగ్ దశలోనే ఉంది. ఇక రాబోయే రోజుల్లో ప్రభాస్ సందీప్ రెడ్డి వంగాతో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. లిస్టులో మరో ఇద్దరు దర్శకులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా మరొక దర్శకుడి పేరు వైరల్ అవుతుంది. అతను మరెవరో కాదు జవాన్ దర్శకుడు అట్లీ అని తెలుస్తోంది.

కొన్ని నెలల క్రితమే లియో దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూడా ప్రభాస్ సినిమా చేస్తున్నాడు అని చాలా రకాల కథనాలు వచ్చాయి. కానీ ఆ విషయంలో దర్శకుడు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఇప్పుడు జవాన్ సినిమాతో మరో సక్సెస్ అందుకోవడానికి సిద్ధంగా ఉన్న తమిళ ప్రముఖ దర్శకుడు అట్లీ ప్రభాస్ కోసం కథ రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. జవాన్ సక్సెస్ అయిన తర్వాత ఈ కాంబినేషన్ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందట. తమిళంలో విజయ్ తో కమర్షియల్ సినిమాలు చేసి మంచి గుర్తింపు అందుకున్న అట్లీ జవాన్ సినిమాతో తెలుగులో కూడా సక్సెస్ అందుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు.

Post a Comment

Previous Post Next Post