భోళా థియేటర్లు లాగేసుకుంటున్న జైలర్. నష్టం ఎంత?


మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర సినిమా ఊహించని స్థాయిలో భారీ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు అలా టాక్ రావడంతో రజినీకాంత్ జైలర్ కు చాలా బాగానే ఉపయోగపడింది. ఈ హాలిడేస్ లో జనాలు ఎక్కువగా జైలర్ సినిమా వైఫై మగ్గు చూపారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా భోళా కంటే ఎక్కువ స్థాయిలో జైలర్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

అయితే చాలా ఏరియాలలో ఇప్పుడు భోళా శంకర్ కు చేదు అనుభవం ఎదురు కానుంది. ఎందుకంటే ప్రస్తుతం జైలర్ ఫామ్ లో ఉండడంతో ఎక్కువ థియేటర్లు ఈ సినిమాకు షిఫ్ట్ కాబోతున్నాయి. ఆగస్టు 15వ రోజు కూడా భోళా శంకర్ కు పెద్దగా కలెక్షన్స్ ఏమీ రాలేదు. ఇక నిన్నటి వరకు కలెక్షన్స్ ఏమైనా పేరుగుతాయేమో అని చూసిన డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పుడు భోళా ను తీసేసి జైలర్ పై ఫోకస్ చేసి ఆ సినిమాను ప్రదర్శించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక భోళా శంకర్ సినిమా ఇంకా బాక్సాఫీస్ వద్ద 54 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్ అయితే వెనక్కి తేవాలి. కానీ అంత వెనక్కి వచ్చేలా లేదు. దాదాపు 50 కోట్లకు పైగా నష్టాలను కలిగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post