కోకాపేట భూములు.. అప్పుడే గిఫ్ట్ గా ఇచ్చిన చిరు


హైదరాబాద్ కోకాపేట భూముల రేట్లు ఈ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోకాపేటలో HMDA ఈ- వేలం నిర్వహించిన నియో పోలీస్ రెండవ దశ వేలంలో న్యూ రికార్డ్ క్రియేట్ అయ్యింది. అసలు ఈ రేంజ్ లో రేట్లు ఉంటాయని ఎవరు ఊహించలేదు. ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర్లోని ప్లాట్ నంబర్ 10లో ఎకరం రూ.100.75 కోట్లు పలికింది.

అయితే అలా ధర పలికిన ల్యాండ్ కి దగ్గరలోనే ఒక కిలో మీటర్ దూరంలో మెగాస్టార్ చిరంజీవికి 20 ఎకరాలు ఉన్నాయి. ఆచార్య సెట్ కూడా అక్కడే వేశారు. ఇక గతంలో మెగాస్టార్ తన ఇద్దరి సోదరీమణులకు రాఖీ కానుకగా కొన్ని ల్యాండ్స్ ఇచ్చారు. ఇప్పుడు వాటి ధర కూడా హై రేంజ్ లోనే ఉంది. ఆ ఏరియాలలో అక్కినేని నాగార్జున, మురళీమోహన్ వంటి వారికి కూడా ల్యాండ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరికొందరు స్టార్ హీరోలు, రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలు వేల ఎకరాల పంట పొలాలకు రైతు బంధు డబ్బులు కూడా గట్టిగానే అందుకుంటున్నారు.

Post a Comment

Previous Post Next Post