ఒకటి రెడీ.. మహేష్ ఒప్పుకుంటాడా?


సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ తో సినిమా అనుకున్నప్పటి నుంచి తన ఆలోచనలతో షాక్ ఇస్తున్నాడు. సాధారణంగా మహేష్ ఒకప్పుడు డైరెక్టర్ కు ఒకసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటే మళ్ళీ వేలు, వంకలు పెట్టేవారు కాదు. కానీ ఇప్పుడు మహేష్ వేరు. షూట్ స్టార్ట్ చేసిన తరువాత కూడా కాస్త తేడా అనిపించినా మొహం మీదే చెప్పేస్తున్నాడు. ఇక గుంటూరు కారం ఎన్నిసార్లు మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

అయితే థమన్ విషయంలో కూడా మహేష్ హ్యాపీ గా లేడని చాలా రకాల వార్తలు వచ్చాయి. అయితే ముందుగా ఒక సాంగ్ రిలీజ్ చేస్తే ఒక టెన్షన్ వదిలిపోతుందని ఫ్యాన్స్ కు కూడా క్లారిటీ ఇచ్చినట్లు ఉంటుందని అనుకుంటున్నారు. ఇక ఫస్ట్ సాంగ్ కోసం ముంబాయిలో సాంగ్ మిక్సింగ్, రికార్డింగ్ చేయించి థమన్ హైదరాబాద్ కు వచ్చాడు. త్రివిక్రమ్ అయితే ఓకే చెప్పాడు. కానీ హీరో వరకు ఇంకా అవుట్ పుట్ చేరలేదు. ఎలాగైనా పాట విడుదల చేస్తే చాలా గ్యాసిప్ లకు ఫుల్ స్టాప్ పెట్టినట్లు అవుతుందని భావిస్తోంది బ్యానర్.

Post a Comment

Previous Post Next Post