బాలయ్యతో సింహం.. తేడా వస్తే ట్రోల్స్ పక్కా?


నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం రెండు సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు ఒకవైపు అనిల్ రావిపూడి భగవంథ్ కేసరి సినిమా విడుదలకు సిద్ధమవుతూ ఉండగా మరోవైపు బాబీ దర్శకత్వంలో మరొక సినిమా చేస్తున్నాడు. వాల్తేరు వీరయ్యతో మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు బాబి బాలయ్యను కూడా పూర్తిస్థాయిలో కమర్షియల్ మాస్ హీరోగా ప్రజెంట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. 

అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక గాసిప్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది. అది ఎంతవరకు నిజమనేది తెలియదు కానీ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారు అయితే ఆ సన్నివేశంలో బాలయ్య బాబు సింహం ఎదురుగా ఉండే ఒక సన్నివేశం హైలైట్ అవుతుందట. గ్రాఫిక్స్ కోసం చుట్టూ గ్రీన్ మ్యాట్ కూడా వేసినట్లుగా తెలుస్తోంది.

ఒక సింహం వర్సెస్ బాలయ్య అనే రేంజ్ లోనే దర్శకుడు ఒక ఇంట్రడక్షన్ సన్నివేశాన్ని షూట్ చేస్తున్నట్లుగా టాక్ అయితే వినిపిస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే గనక ఫ్యాన్స్ కు మాత్రం మంచి కిక్ ఇస్తుంది అని చెప్పవచ్చు. ఇక తేడా వస్తే మాత్రం ట్రోల్స్ కి ఛాన్స్ ఇచ్చినట్లే. ఇక ఈ సినిమాలో ఒక ఫ్లాష్ బ్యాక్ లో కాస్త పొలిటికల్ టచ్ కూడా ఉండబోతుందట. అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడా దర్శకుడు అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా సినిమాను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం.

Post a Comment

Previous Post Next Post