కమ్ముల - ధనుష్.. రష్మిక రేటు తగ్గింది!


శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ చేయబోతున్న సినిమాలో మెయిన్ హీరోయిన్ గా రష్మిక మందన ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఇటీవల అధికారికంగా ప్రకటన కూడా ఇచ్చేశారు. అయితే ఈ ఛాన్స్ కోసం అమ్మడి మేనేజర్ టీమ్ అయితే గట్టిగా ప్రయత్నాలు చేసినట్లుగా తెలుస్తోంది. ఒకవైపు శేఖర్ కమ్ముల మరోవైపు ధనుష్ ఇద్దరు కూడా సౌత్ ఇండస్ట్రీలో ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నవారు.

తప్పకుండా ఈ కాంబినేషన్ ఊహించని రేంజ్ లో ఉంటుంది అని చెప్పవచ్చు. అయితే ఈ క్రమంలో శేఖర్ కమ్ముక మొదట ఎవరైనా కొత్త హీరోయిన్ ను తీసుకోవాలని అనుకున్నారు. కానీ రష్మిక టీం మాత్రం నిర్మాతలను సంప్రదించి అటువైపుగా ఛాన్స్ కొట్టేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు మాత్రం ఈ బ్యూటీ పెద్ద సినిమాలకు తీసుకున్నంత రేంజ్ లో అయితే పారితోషకం తీసుకోవడం లేదట. 

ప్రస్తుతం 3.50 కోట్ల రేంజ్ లో పుష్ప సెకండ్ పార్ట్ కోసం వర్క్ చేస్తున్న ఈ బ్యూటీ లేటెస్ట్ గా ఏ సినిమా ఓకే చేసిన మినిమం 4 కోట్లు అడిగేస్తోంది. అయితే శేఖర్ కమ్ముల ధనుష్ సినిమాలను నిర్మిస్తున్న ఏషియన్ సినిమాస్ మాత్రం ఈ బ్యూటీకి కేవలం రెండు కోట్ల రేంజ్ లోనే రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. బడ్జెట్ అనుకున్న దాన్ని బట్టి ఆ రేంజ్ లోనే హీరోయిన్ ను ఫిక్స్ చేసుకోవాలని అనుకున్నారట. ఇక ఈ కాంబినేషన్ ను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు అని రష్మిక కూడా పెద్దగా అభ్యంతరాలు లేకుండానే ఆ రేటుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Post a Comment

Previous Post Next Post