సినిమా కోసం.. కోటి తగ్గించిన సామ్!


ఖుషి సినిమా విడుదల కావడానికి ఇంకా ఎంతో సమయం లేదు. ఈ రెండు మూడు రోజుల్లోనే సినిమాకు కావాల్సినంత ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ విజయ్ దేవరకొండ మాత్రమే తన శక్తి మేరకు ప్రమోషన్స్ అయితే చేస్తున్నాడు. కానీ సమంత మాత్రం పెద్దగా ప్రమోషన్స్ అయితే చేయడం లేదు. కేవలం సోషల్ మీడియాలోనే తనకు వీలైనంతవరకు ప్రమోషన్స్ అయితే చేస్తోంది.

అయితే సమంత ఇప్పుడు ప్రమోషన్స్ లో పాల్గొనకపోవడం కూడా సినిమాకు కొంత మైనస్ అని చెప్పాలి. తన ఆరోగ్యం గురించి చిత్ర నిర్మాతలు కూడా ఆమెకు సహకరించినప్పటికీ సమంత మాత్రం మంచి మనసుతో నిర్మాతలకు ఒక మంచి సహకారం అయితే చేసినట్లుగా తెలుస్తోంది. తనకు రావాల్సిన రెమ్యునరేషన్ నుంచి కోటి వరకు తగ్గించినట్లు సమాచారం. ఖుషి సినిమా కోసం సమంత దాదాపు 4.5 కోట్ల మేరకు రెమ్యునరేషన్ డీల్ సెట్ చేసుకుంది. ఇక మొదట నిర్మాతలు 2.5 కోట్ల మేరకు అడ్వాన్స్ ఇవ్వగా ఇప్పుడు కేవలం ఒక కోటి మాత్రమే ఇవ్వాలి అని ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదు కాబట్టి కోటి తగ్గించుకోవాలి అని ఆమె నిర్మాతలకు సపోర్ట్ చేసినట్లు సమాచారం.

Post a Comment

Previous Post Next Post