సలార్.. దిల్ రాజు డీల్ అంటే ఇలా ఉంటుంది


ప్రభాస్ రాబోయే బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇండియా మూవీ సలార్ పైనే అందరి ఫోకస్ ఎక్కువగా ఉంది. అయితే ఈ సినిమా మార్కెట్లో మంచి డిమాండ్ అయితే ఏర్పరచుకుంది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 170 కోట్లకు పైగా బిజినెస్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక నైజా ఏరియాలో అయితే ఈ సినిమాకు ఉన్న బజ్ కారణంగా నిర్మాతలు భారీ స్థాయిలో రేట్లు చెబుతున్నారు. 

మినిమం 80 కోట్ల రేంజ్ లోనే కోట్ చేసినట్లుగా టాక్ అయితే వినిపించింది. అయితే మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నైజాం హక్కుల కోసం గట్టిగానే పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దిల్ రాజు అయితే 65 కోట్ల రేంజ్ లో ఈ సినిమా నైజాం హక్కులను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక 80 కోట్ల డీల్ కు కూడా ఆయన కాస్త పాజిటివ్ గానే రియాక్ట్ అవుతున్నారు.

కానీ సినిమా సక్సెస్ అయితే ముందు అనుకున్నా డీల్ కు తగ్గట్టుగా నిర్మాతలకు 80 కోట్లు దక్కుతుంది. లేదంటే సినిమా ఫ్లాప్ అయితే మరో 15 కోట్లు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్ కు వెనక్కి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ సినిమా హక్కుల కోసం మొన్నటివరకు చాలా గట్టిగానే ప్రయత్నాలు చేసింది. కానీ ఇప్పుడు దిల్ రాజు డీల్ ను చూసి వాళ్ళు వెనుకడుగు వేసినట్లు సమాచారం.

Post a Comment

Previous Post Next Post