విజయ్ దేవరకొండ శివ నిర్వాణ కాంబినేషన్లో రాబోతున్న ఖుషి సినిమాపై అంచనాలు అయితే మెల్లమెల్లగా పెరిగిపోతున్నాయి. మొదట సాంగ్స్ తోనే కావాల్సినంత బజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో మరికొన్ని స్పెషల్ ప్రమోషన్స్ తో కూడా సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు.
ట్రైలర్ కూడా మంచి అంచనాలను క్రియేట్ చేసుకుంది. ఇక ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లో మంచి సక్సెస్ అందుకోవాలని విజయ్ దేవరకొండ అన్ని వైపుల ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ దాదాపు 60 కోట్ల భారీ బడ్జెట్ తోనే నిర్మించింది. ఇక ఎవరెవరికి ఎంత రెమ్యునరేషన్స్ ఇచ్చారు అనే వివరాల్లోకి వెళితే ముందుగా విజయ్ దేవరకొండకు దాదాపు 23 కోట్ల రేంజ్ లోనే అందినట్లుగా తెలుస్తోంది. సమంతకు 4.5 కోట్లు ఇచ్చినట్లు టాక్. ఇక దర్శకుడు శివ నిర్వాన ఈసారి అత్యధిక స్థాయిలోనే 12 కోట్ల రేంజ్ లో పారితోషికం అందుకున్నట్లు సమాచారం.
Follow
Post a Comment