భగవంత్ కేసరి బిజినెస్.. మరో బిగ్ రికార్డ్!


నందమూరి బాలకృష్ణ మార్కెట్ రేంజ్ రోజురోజుకు మరింత పెరిగిపోతుంది. అఖండ సినిమాతో ఒక్కసారిగా మళ్లీ బౌన్స్ బ్యాక్ అయినా బాలయ్య బాబు ఆ తర్వాత వీర సింహారెడ్డి సినిమాతో కూడా మార్కెట్లో మంచి ఓపెనింగ్స్ అయితే అందుకున్నాడు. ఆ సినిమా కంటెంట్ అంతగా క్లిక్ కాకపోయినప్పటికీ కూడా బాలయ్య స్టార్ ఇమేజ్ వలన బాక్సాఫీస్ వద్ద మంచి బిజినెస్ అయితే చేసింది. 

అయితే ఈసారి భగవంత్ కేసరి సినిమాకు కూడా మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమా సరికొత్త రికార్డు క్రియేట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అఖండ సినిమా దాదాపు 54 కోట్ల రేంజ్ లోనే బిజినెస్ చేయగా ఆ తర్వాత వీరసింహారెడ్డి సినిమా 73 కోట్ల రేంజ్ లోనే థియేట్రికల్ బిజినెస్ చేసింది. రెండు కూడా బాక్సాఫీస్ వద్ద టార్గెట్ ఫినిష్ చేశాయి. అయితే ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాకు దాదాపు 75 కోట్ల స్థాయిలోనే ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. మరి ఈ టార్గెట్ ను సినిమా ఫినిష్ చేస్తుందో లేదో చూడాలి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరపైకి రానున్న ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీన విడుదల కానుంది.

Post a Comment

Previous Post Next Post