చరణ్ పాత్రకు పవన్ కొడుకు పేరు


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ అయితే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మొదట్లో చాలా స్పీడ్ గా కొనసాగిన సినిమా షూటింగ్ కు ఆ తరువాత బ్రేకులు పడుతూ వచ్చాయి. అయితే మొత్తానికి సినిమా షూట్ ఇటీవల మళ్ళీ ఊపందుకుంది. శంకర్ టీమ్ ఒక యాక్షన్ ఎపిసోడ్ ను మొదలు పెట్టింది. 

దాదాపు 500 మంది ఫైటర్స్ తో ఒక యాక్షన్ క్లైమాక్స్ ఎపిసోడ్ ను రూపొందిస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించిన లీక్స్ కూడా వైరల్ అవుతున్నాయి. సినిమాలో ఒక పాత్రకు పవన్ పెద్ద కొడుకు పేరు కు దగ్గరగా పెట్టారట. గేమ్ ఛేంజర్ లో చరణ్ రెండు పాత్రల్లో నటిస్తున్నారు. తండ్రి పాత్ర అప్పన్న కాగా, కొడుకు క్యారెక్టర్ రామ్ నందన్ అని తెలుస్తోంది. 

పవన్ పెద్ద కుమారుడు అకిరా నందన్ కు దగ్గరగా ఉండడంతో ఫ్యాన్స్ లో మంచి హైప్ అయితే క్రియేట్ అయ్యింది. ఇక సినిమా రెండు టైమ్ లైన్స్ లో కొనసాగనుంది. అప్పన్న పొలిటీషియన్ కాగా రామ్ నందన్ ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇక వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

Post a Comment

Previous Post Next Post