సూర్య s/o కృష్ణన్ రీ-రీలీజ్.. సెన్సేషనల్ బాక్సాఫీస్ కలెక్షన్స్!


గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో సూర్య నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ 15 ఏళ్ల క్రితం విడుదలైనప్పుడు తమిళంలో గాని తెలుగులో గాని పెద్దగా ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ ఆ సినిమా కాలం గడిచిన కొద్ది అందులోనే సాంగ్స్ అలాగే కంటెంట్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇప్పటి జనరేషన్ కి కూడా బాగా కనెక్ట్ అవుతున్నారు అని చెప్పాలి.

ఇక ఇప్పుడు రీ రిలీజ్ అయిన ఈ సినిమా ఊహించని విధంగా తెలుగులో మంచి కలెక్షన్స్ అందుకోవడం విశేషం. మొదటి రోజే కాకుండా వీకెండ్ మొత్తం కూడా షాక్ ఇచ్చేలా కలెక్షన్స్ అందుకుంది. మొత్తంగా ఈ సినిమా మొదటివారంతరంలో 2.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక సోమవారం రోజు కూడా సినిమాకు కలెక్షన్స్ అయితే బాగానే వచ్చాయి. 

ఈ సినిమాకు ఈ స్థాయిలో వచ్చిన రెస్పాన్స్ చూసి సూర్య కూడా సోషల్ మీడియాలో చాలా పాజిటివ్ గా స్పందించాడు. అసలు ఈ లెక్కలు మిగతా ఇండస్ట్రీలో వారికి అంతుచిక్కని మ్యాజిక్ లాగా అనిపిస్తుంది. ఒకప్పుడు డిజాస్టర్ అనుకున్న సినిమాలు ఇప్పుడు ఊహించని విధంగా కలెక్షన్స్ అందుకోవడం ఏమిటని షాక్ అవుతున్నారు. ఏదేమైనా తెలుగు ఆడియెన్స్ లవ్ చేస్తే ఇలా ఉంటుంది అని ఈ కలెక్షన్స్ రుజువు చేశాయి.

Post a Comment

Previous Post Next Post