రీ రిలీజ్ సినిమాలు.. నిర్మాతలు ఎంత చెబుతున్నారంటే?


రీ రిలీజ్ సినిమాలకు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయిలో డిమాండ్ పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పటి డిజాస్టర్ సినిమాలకు సైతం యూత్ కు కనెక్ట్ అయితే భారీ స్థాయిలో విడుదల చేసి బయ్యర్స్ మంచి లాభాలను సొంతం చేసుకుంటున్నారు. కొత్త సినిమాలతో పోటీపడి మరి ఆ సినిమాలకు కలెక్షన్స్ వస్తున్నాయి అంటే బజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక ఇప్పుడు మరొక రెండు తెలుగు సినిమాలకు డిమాండ్ పెరిగినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా అందులో శంకర్ దాదా ఎంబిబిఎస్, ఏ మాయ చేసావే సినిమాలను కూడా రీ రిలీజ్ చేసుకునేందుకు కొంతమంది పోటీ పడుతున్నారు. అయితే నిర్మాతలు ప్రస్తుత ట్రెండ్ ను దృష్టిలో ఉంచుకొని భారీగానే డిమాండ్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా రీ రిలీజ్ హక్కులు అమ్మడానికి జెమిని ఫిలిం సర్క్యూట్ వాళ్ళు రెండు కోట్ల రేంజ్ లో కోట్ చేస్తున్నారు. ఇక ఏ మాయ చేసావే సినిమా నిర్మాతలు దాదాపు కోటి వరకు అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఈ సినిమాలు మినిమం మూడు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకుంటేనే పెట్టుబడికి తగ్గట్టుగా వస్తాయి. మరి వాటిపై రిస్క్ చేస్తారో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post