గాండీవధారి అర్జున.. ఇంత బడ్జెట్ తెలిసే పెట్టారా?


మెగా హీరో వరుణ్ తేజ్ ఇప్పుడు గాండీవధారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆగస్టు 25వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ కూడా ఇటీవల విడుదలైంది. అయితే ఇప్పటివరకు సినిమాపై అనుకున్నంత స్థాయిలో అయితే పాజిటివ్ వైబ్రేషన్స్ పెరగలేదు. చిత్ర యూనిట్ రెగ్యులర్ ఇంటర్వ్యూలు ఇస్తుంది కానీ కంటెంట్ తో మాత్రం ఆడియన్స్ ను పెద్దగా ఎట్రాక్ట్ చేయడం లేదు.

ఇక ఏదేమైనా కూడా ఈ సినిమా పై పెట్టిన బడ్జెట్ మాత్రం కాస్త రిస్క్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అసలు ఈ సినిమాపై ఎందుకు అంత ఇంత బడ్జెట్ పెట్టారు అనే విధంగా కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే వరుణ్ తేజ్ గని సినిమాతో పాటు ఎఫ్3 సినిమా కూడా అంతగా సక్సెస్ కాలేకపోయింది. 

ఇక మరోవైపు దర్శకుడు ప్రవీణ్ సత్తారు నాగార్జునతో చేసిన ది గోస్ట్ సినిమా కూడా దారుణంగా డిజాస్టర్ అయింది. అయినప్పటికీ ఈ కాంబినేషన్ పై నిర్మాత 40 కోట్లకు పైగానే ఖర్చు చేసినట్లు సమాచారం. బడ్జెట్ పెడితే పెట్టారు గాని సినిమాకు మాత్రం అనుకున్నంత స్థాయిలో అయితే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ కావడం లేదు. ఇక రాబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో అయినా సినిమాకు కొంత హైప్ క్రియేట్ చేస్తారో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post