శర్వానంద్ - రజినీకాంత్.. నిజమైతే లక్కే!


యువ హీరో శర్వానంద్ కూడా చాలా కాలంగా సక్సెస్ లేక సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈసారి ఎలాగైనా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో సక్సెస్ అందుకొని ఫామ్ లోకి రావాలని అనుకుంటున్నాడు. అయితే శర్వానంద్ కు అగ్ర హీరోల సినిమాల్లో కూడా ముఖ్యమైన పాత్రలలో నటించే అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న మరొక టాక్ ప్రకారం శర్వానంద్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో కూడా ఒక కీలకమైన పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. రజనీకాంత్ జై భీమ్ దర్శకుడు జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. అయితే అందులో ముఖ్యమైన పాత్రల కోసం ఇతర ఇండస్ట్రీలలోని ప్రముఖ నటులను సెలెక్ట్ చేసుకుంటున్నారు. బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్ కూడా ఒక పాత్రలో నటించబోతున్నారు. ఇక తెలుగు నుంచి శర్వానంద్ ను తీసుకుంటున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ విషయంలో అధికారికంగా క్లారిటీ కూడా రానున్నట్లు సమాచారం.

Post a Comment

Previous Post Next Post