గుంటూరు కారం.. అందుకే అప్డేట్ ఇవ్వట్లే..


గుంటూరు కారం సినిమా షూటింగ్ మొత్తానికి ఒక ట్రాక్లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు గ్యాప్ లేకుండా చకచకా పనులను పూర్తి చేస్తున్నాడు. ఇక త్రివిక్రమ్ కూడా కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు అందుబాటులో లేకపోయినప్పటికీ అవసరమైతే మొదట అనుకున్న వారిని తీసేసి మరొకరిని షూటింగ్ కు పిలిపిస్తున్నారు. ఇక గుంటూరు కారం సినిమా అప్డేట్స్ విషయంలో చాలా ఆలస్యమైతే జరుగుతోంది.

మహేష్ బాబు పుట్టినరోజు కూడా పెద్దగా అప్డేట్ ఇవ్వకపోవడం కొంత సినిమాపై బజ్ తగ్గించినట్లుగా అనిపిస్తుంది. అయితే ఈ సినిమా అప్డేట్ విషయంలో నిర్మాతలు దర్శకుడు వెనుకడుగు వేయడానికి ముఖ్య కారణం మహేష్ బాబు అని తెలుస్తోంది. ఇప్పటికే తమన్ సాంగ్ కూడా రెడీ చేశాడు. అలాగే రెండో పాట కూడా దాదాపు రెడి అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఎలాంటి టీజర్ సాంగ్స్ ఇవ్వకూడదు అని మహేష్ బాబు చిత్ర యూనిట్ కి చెప్పినట్లు సమాచారం.

ఎందుకంటే సినిమాను జనవరిలో విడుదల చేయాలి. అంటే ఇంకా నాలుగు నెలల సమయం ఉంది ఒక నెల రోజులు ఆగి ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒక అప్డేట్ విడుదల చేస్తే సినిమాకు మంచి హైప్ వస్తుంది అని అప్డేట్స్ విషయంలో మళ్ళీ పెద్దగా గ్యాప్ ఉండకుండా చూసుకోవాలి అనే ఆలోచనను సూచించారట. కుదిరితే దసరా సమయంలో అప్డేట్ రావచ్చని సమాచారం.

Post a Comment

Previous Post Next Post