స్కంద.. ఆ హీరో రిజెక్ట్ చేసిందేనా?


బోయపాటి దర్శకత్వంలో రామ్ పోతినేని చేసిన స్కంద సినిమా సెప్టెంబర్ 15వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ కు కాస్త మిక్స్ డ్ టాక్ అయితే వస్తోంది. ఎందుకంటే ఎప్పటిలానే బోయపాటి రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్ తోనే ఈ సినిమాను తెరపైకి తీసుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ట్రైలర్లో కొన్ని సీన్స్ పై కూడా అప్పుడే ట్రోలింగ్ మొదలైంది. ఇక డైలాగ్స్ చాలా రొటీన్ గా ఉన్నాయి అని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంకా బోయపాటి ఇలా ఎన్నాళ్లు సినిమాలు చేస్తాడు అనే తరహాలో కథనాలు కూడా వెలువడుతున్నాయి. అయితే స్కంద సినిమా కథను మొదట బోయపాటి మహేష్ బాబుకు చెప్పినట్లుగా తెలుస్తోంది. బోయపాటి లెజెండ్ సినిమా తీసిన తర్వాత నుంచి మహేష్ బాబుతో సినిమా చేయాలి అని చాలా ప్రయత్నాలు చేశాడు. ఇక వినయ విధేయ రామ తర్వాత కూడా బాబుతో మాట్లాడడం జరిగింది. అయితే అప్పుడు కూడా స్కంద స్టోరీ లైన్ గురించి మహేష్ తో చెప్పగా ఏమాత్రం నచ్చలేదని రిజెక్ట్ చేశాడట. ఇక తర్వాత మళ్ళీ మహేష్ వైపు తిరగకుండా ఆ కథను అఖండ తరువాత రామ్ కు సెట్ చేసినట్లుగా తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post