నాగచైతన్యతో.. పాకిస్థాన్ లింక్ - హై బడ్జెట్!


అక్కినేని హీరో నాగచైతన్య గత కొంతకాలంగా సక్సెస్ లేక సతమతమవుతున్నాడు. అతని ప్రతి సినిమాకు ఏదో ఒక యాంగిల్ లో పాజిటివ్ హైప్ అయితే వస్తుంది గాని సక్సెస్ రావడం లేదు. ఇక నాగచైతన్య సోలోగా ఏదైనా ఒక మంచి సక్సెస్ తో తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఇప్పుడు చందు మొండేటి దర్శకత్వంలో చేయబోతున్న సినిమా మాత్రం పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే ఉండబోతుందట.

అసలే కార్తికేయ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన చందు నాగచైతన్యత ఉన్న రిలేషన్ తో మంచి బడ్జెట్ తోనే గ్రాండియర్ సినిమా చేయనున్నాడట. గీత ఆర్ట్స్ బన్నీ వాసు కూడా వీరితో జత కలిసి ప్రణాళికలు రచిస్తున్నాడు. సినిమా బడ్జెట్ దాదాపు 100 కోట్ల రేంజ్ లోనే ఉంటుంది అని ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ఇక ఇదివరకే ఈ సినిమా కథకు సంబంధించిన లీక్స్ కూడా బయటకు వచ్చాయి. సినిమా కథ ఆంధ్రప్రదేశ్ విలేజ్ నుంచి పాకిస్తాన్ దేశం కు లింక్ అయి ఉంటుందట. ఎమోషనల్ సీరియస్ డ్రామాగా ఉండబోయే ఆ కథలో నాగచైతన్య నెవర్ బిఫోర్ అనేలా సరికొత్తగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో అయినా అతను సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post