సలార్ ఇంగ్లీష్ వెర్షన్.. ముందు జాగ్రత్తలు..!


ప్రభాస్ సలార్ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. కేజిఎఫ్ సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈసారి తప్పకుండా ప్రభాస్ ను హై వోల్టేజ్ యాక్షన్ తో ప్రజెంట్ చేస్తాడు అని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలోనే విడుదల చేయబోతున్నారు.

అయితే ఇండియన్ లాంగ్వేజెస్ లో భారీగానే విడుదలవుతున్న ఈ సినిమా హాలీవుడ్లో కూడా వైరల్ అయ్యేలా ఇంగ్లీషులో కూడా చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇప్పటివరకు ఆ విషయంలో చిత్ర యూనిట్ కూడా క్లారిటీ ఇచ్చింది అయితే లేదు. కానీ ప్రస్తుతం బ్యాగ్రౌండ్ లో మాత్రం చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లీష్ వెర్షన్ కు సంబంధించిన ప్లాన్ అయితే సిద్ధంగా ఉంది.

కానీ దానికి తగ్గట్టు ఆచరణలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని తెలుస్తోంది. ముందుగా ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అయిన తర్వాతనే ఇంగ్లీష్ వెర్షన్ గురించి ఆలోచించాలని అనుకుంటున్నారు. ఒకేసారి ఇంగ్లీషులో కూడా విడుదల చేయకూడదు అని ముందుగా ఈ సినిమాకు రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూసిన తర్వాత హాలీవుడ్లో వీలైతే ప్రమోషన్ చేసి విడుదల చేయాలని అనుకుంటున్నారు.

Post a Comment

Previous Post Next Post