మరో మెగా హీరోతో సాయి పల్లవి?


టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవి ఇటీవల కాలంలో మళ్ళీ స్లో అయింది. తెలుగులో అయితే ఆమె చివరగా లవ్ స్టోరీ సినిమాలో నటించింది. ఇక ఆ తర్వాత మధ్యలో గార్గి అనే ఒక సినిమా చేసింది. కానీ అదేమీ అంతగా క్లిక్ కాలేదు. ఇక ప్రస్తుతం కొంత గ్యాప్ తీసుకున్న అమ్మడు మళ్ళీ డిఫరెంట్ కదతోనే ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకుంటుంది. అయితే సాయి పల్లకి ఇటీవల మెగా హీరో నుంచి ఛాన్స్ వచ్చినట్లు సమాచారం.

సాయి ధరమ్ తేజ్ సినిమాకు కార్తికేయ 2 దర్శకుడు చందు మొండేటి ఒక కథను అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆ సినిమాను అతను డైరెక్ట్ చేస్తాడా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకంటే ప్రస్తుతం చందు నాగచైతన్యతో సినిమా చేస్తున్నాడు. అది పాన్ ఇండియా లెవెల్లో తెరపైకి తీసుకువస్తున్నారు కాబట్టి దాదాపు ఏడాది పాటు అతను బిజీగా ఉండే అవకాశం ఉంది. అయితే ఆ సినిమా కథకు మాత్రం సాయి పల్లవి అయితేనే పర్ఫెక్ట్ అని చందు ఫిక్స్ అయ్యాడట. అయితే ఆ కథ కోసం మరో దర్శకుడుని సెట్ చేస్తారా లేదంటే మరో ఏడాది పాటు చందు కోసం ఎదురు చూస్తారా అనేది చూడాలి.

Post a Comment

Previous Post Next Post