శక్తి, షాడో కాదు.. పోకిరిలో కూడా మెహర్ రమేష్ హ్యాండ్


సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక్క డిజాస్టర్ అందుకున్న కూడా మరో ఛాన్స్ అందుకోవడం అంత ఈజీ కాదు. కానీ దర్శకుడు మెహర్ రమేష్ వరుసగా రెండు డిజాస్టర్ చూసిన కూడా అతనికి మెగాస్టార్ చిరంజీవితో అవకాశం దక్కింది. ఒక విధంగా ఆయనకు దగ్గర బంధువు అనే కాదు. మెహర్ రమేష్ ను నమ్మడానికి చాలా కారణాలు ఉన్నాయి. మెహర్ స్వయానా అంజనాదేవి చెల్లెలి కొడుకు. సోదర బంధుత్వం ఆయనకు మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచింది. 

అంతేకాకుండా ఇండస్ట్రీలో ప్రభాస్ మహేష్ లాంటి హీరోలతో కూడా మంచి అనుబంధమైతే ఉంది. ఆంధ్రావాలా ఒక్కడు లాంటి సినిమాలను కన్నడలో తీసి బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న మెహర్ రమేష్ కు రీమేక్ స్పెషలిస్ట్ గానే మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఇక అతనికి దేశముదురు పోకిరి లాంటి సినిమాల సక్సెస్ లో కూడా కొంత భాగం ఉంది అని చెప్పవచ్చు. 

ఎందుకంటే పూరి జగన్నాథ్ ఆ రెండు సినిమాలకు కూడా అతన్ని ప్రధాన రైటర్ గా కూడా తన టీంలో చేర్చుకున్నాడు. పోకిరి సినిమాకు దాదాపు అన్ని ఎపిసోడ్స్ లలో లో మెహర్ రమేష్ పాత్ర కూడా ఉంది. టైటిల్స్ లో పూరి అతనికి కూడా క్రెడిట్ ఇచ్చాడు. ఇక శక్తి, షాడో లాంటి డిజాస్టర్స్ అందుకున్న తర్వాత కొంత కాలం పాటు గ్యాప్ తీసుకున్న మెహర్ రమేష్ అన్నయ్య చిరు దృష్టిని ఆకర్షించాడు. నువ్వు రీమేక్ అయితే  పర్ఫెక్ట్ సక్సెస్ అందుకోగలవు అని వేదళం సినిమా చేసే ఛాన్స్ అయితే ఇచ్చాడు. మరి దీంతో అయినా రమేష్ ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post