నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న బిగ్ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898AD సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ అనుకున్నంత స్థాయిలో పాజిటివ్ బజ్ క్రియేట్ చేయకపోయినప్పటికీ కూడా ఈ సినిమా తప్పకుండా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని ఫ్యాన్స్ కూడా ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ సినిమాను మొదట అయితే 2024 సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆ డేట్కు సినిమా సిద్ధమయ్యేలా కనిపించడం లేదు.
దీంతో 2024 మే నెలలో తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా టాక్ అయితే వినిపించింది. ఇక ఆ కథనాలపై దర్శకుడు ఒక క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం చేశాడు. కల్కి షూటింగ్ దాదాపు దురదశకు చేరుకుంది. ఇంకా కొంత భాగమే మిగిలి ఉంది. ప్రస్తుతం ఫోకస్ మొత్తం దానిపైనే ఉంది. ఇక విడుదల డేట్ విషయంలో కూడా ఒక మంచి రోజు చూసుకుని క్లారిటీ ఇస్తామని అంటూ.. ఈ సినిమాలో ప్రభాస్ మాత్రం గతంలో ఎప్పుడు లేనంత సరి కొత్తగా కనిపించబోతున్నాడు అని దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక మీడియా ఇంటర్వ్యూలో అయితే వివరణ ఇచ్చాడు. మరి అనుకున్న డేట్ ప్రకారం సంక్రాంతికి వస్తారా? లేదంటే కాస్త ఆలస్యంగా మే నెలలో వస్తారా? అనే విషయం తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow
Post a Comment