భోళా నిర్మాత.. దెబ్బలు కొత్త కాదు!


మంచు మనోజ్ బిందాస్ సినిమాతో నిర్మాతగా పరిచయమైన అనిల్ సుంకర అంతకుముందు అమెరికాలో అలాగే ఇండియాలో కూడా పలు వ్యాపారాలతో చాలా బిజీగా కనిపించేవారు. అయితే ఇప్పుడు ఆయన భోళా శంకర్ సినిమాతో ఊహించని విధంగా మరో డిజాస్టర్ ఎదుర్కొన్నారు. ఇక ఆయనకు డిజాస్టర్స్ అనేవి కొత్తవి కాదు. ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాలలో సక్సెస్ కంటే డిజాస్టర్ అయిన సినిమాలే ఎక్కువ. కానీ ఆయన తట్టుకున్న విధానం మాత్రం అందరిని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఇక అనిల్ సుంకర అల్లరి నరేష్ తో 'యాక్షన్ 3D' కి నిర్మాతగానే కాకుండా దర్శకత్వం కూడా వహించారు. ఆ సినిమా దారుణాతి దారుణమైన దెబ్బ కొట్టింది. ఇక మొదట 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ లో తన సోదరులతో కలిసి పలు సినిమాలను నిర్మించారు. అందులో దూకుడు, లెజెండ్ వంటి సినిమాలతో అయితే మంచి సక్సెస్ అందుకున్నారు.

కానీ ఆ తర్వాత 1 నేనొక్కడినే, ఆగడు, జేమ్స్ బాండ్, ఈడో రకం ఆడో రకం, సెల్ఫీ రాజా, ఈడు గోల్డ్ ఎహె, లై, కిరాక్ పార్టీ, సీత, చాణక్య వంటి సినిమాలతో ఊహించిన విధంగా డిజాస్టర్స్ ఎదుర్కొన్నారు. ముఖ్యంగా గత ఏడాది నుంచి ఆయనకు అన్ని డిజాస్టర్సే ఎదురవుతున్నాయి. సరిలేరు నీకెవ్వరు పరవాలేదు అనిపించినప్పటికీ ఆ తర్వాత వచ్చిన బంగారు బుల్లోడు మహా సముద్రం అయితే మరింత నష్టాలను కలుగజేశాయి. 

ఇక ఏజెంట్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా దాదాపు 40 కోట్లకు పైగానే పోగొట్టింది. ఇక ఇప్పుడు భోళా శంకర్ సినిమా ద్వారా మరో 50 కోట్లు పోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పెద్ద సినిమాలు ఏమీ లేవు మరి ఆయన తదుపరి సినిమాలో స్క్రిప్ట్ విషయాలలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

Post a Comment

Previous Post Next Post