టాలెంటెడ్ దర్శకుడు క్రిష్ పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమాను ఎప్పుడో పూర్తి చేయాలని అనుకున్నాడు. కానీ వివిధ కారణాల వలన ఈ సినిమా షూటింగ్ చాలాసార్లు వాయిదా పడింది. ఇక ఇటీవల మళ్ళీ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ కావడం వలన ఇప్పట్లో అయితే ఆ సినిమా షూటింగ్ మళ్లీ పట్టాలు ఎక్కే అవకాశం లేదని తెలుస్తోంది. మళ్ళీ ఎలక్షన్స్ తరువాతే ఉండవచ్చని టాక్.
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూసి క్రిష్ అయితే చాలా సమయం వృధా చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం బిజీగా ఉండడం వలన పవన్ కళ్యాణ్ క్రిష్ ను మరో సినిమా చేసుకోమని సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇంతకుముందే హరిహర వీరమలు స్టార్టింగ్ సమయంలో కొంత గ్యాప్ రావడం వలన క్రిష్ వైష్ణవ తేజ్ తో కొండపొలం అనే సినిమా చేశాడు.
అతనితో సినిమా చేయమని పవన్ కళ్యాణ్, అప్పుడు సలహా ఇచ్చాడు. ఇక ఇప్పుడు మరోసారి పెద్ద మేనల్లుడు సాయి ధరంతేజ్ తో కూడా క్రిష్ కు అవకాశం ఇచ్చినట్లు. తెలుస్తోంది క్రిష్ కూడా అందుకు సమకంగానే ఉన్నట్లుగా సమాచారం. ఇక హరిహర వీరమల్లు కు స్పెషల్ కేర్ తీసుకోవాలి కాబట్టి ఎలక్షన్స్ తరువతేనే బెటర్ అని పవన్ డిసైడ్ అయినట్లు టాక్.
Follow
Follow
Post a Comment