జైలర్ మూవీ - రివ్యూ & రేటింగ్


కథ:
ముత్తు, అకా టైగర్ ముత్తువేల్ పాండియన్ (రజినీకాంత్) పోలీస్ ఉద్యోగం నుంచి పదవీవిరమణ పొంది తన కుటుంబం మరియు స్నేహితులతో కలిసి హ్యాపీగా జీవితాన్ని కొనసాగించాలని అనుకుంటాడు. ఇక ఇంతలోనే కొన్ని సంఘటనలు ఉహించని విధంగా కుటుంబాన్ని ప్రభావితం చేస్తాయి. కొడుకు హఠాత్తుగా మాయమవుతాడు. ఇక అతని మరణవార్త విన్నప్పుడు ఏమవుతుంది? నిందితుడు ఎవరు, ఎలా పగ తీర్చుకున్నాడు అనేది సినిమా ప్రధాన కథాంశం.

విశ్లేషణ:
సూపర్‌స్టార్ రజనీకాంత్‌ స్టార్ హోదాకు జైలర్ చాలా భిన్నమైన కథ. అతను తన శైలిని ఎప్పటిలానే మెయింటైన్ చేస్తూ స్టైలింగ్ లో కూడా తేడా రాకుండా చూసుకున్నాడు. బాడీ లాంగ్వేజ్ మరియు నటన కూడా సూపర్ స్టార్ మార్క్ ను హైలెట్ చేస్తుంది. దర్శకుడు నెల్సన్ రజనీకాంత్ ను వయసుకు తగ్గ కథాంశంతోనే మాస్ మూమెంట్స్ ఉండేలా ఒక పాత్రను ఇచ్చాడు. ఇవన్నీ చాలా సెన్సిటివ్ పద్ధతిలో హైలెట్ అయ్యాయి. ఇక యాక్షన్ సన్నివేశాలలో తలైవా మార్క్ ఎక్కడా తగ్గదు. 

ప్రారంభం నుండి కథ ప్రకారం రజనీకాంత్ తన పాత్రలో ఉంటూ ఫ్యాన్స్ కు కిక్ అయితే ఇచ్చాడు. ఇక ఫస్ట్ హాఫ్‌లో రమ్యకృష్ణకు పెద్దగా పాత్ర లేదు. ఆమె అడపాదడపా మరియు చక్కగా కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఏదీ గుర్తుంచుకోదగినది కాదు. డాక్టర్, బీస్ట్ ఫేమ్ నెల్సన్ తన శైలిని ఇక్కడ కూడా హైలెట్ చేశాడు. ఇక కామెడీ ఎపిసోడ్స్ ను సీరియస్ సీన్స్ లో కలిపిన వైనం అతని గత సినిమాలను గుర్తు చేస్తుంది. ముందు స్క్రీన్ ప్లే హీరో పాత్రను బలంగా హైలెట్ చేయగా.. జైలర్ అసలు కథ నెమ్మదిగా ప్రారంభమవుతుంది. 

జైలర్ ఫస్ట్ హాఫ్ యాక్షన్-ప్యాక్డ్ సెకండ్ హాఫ్ కోసం సెటప్ లాగా పనిచేస్తుంది. విలన్ కు సంబంధించిన సీన్స్ అంత బలంగా ఏమి లేవు. కాస్త కొత్తగా ట్రై చేయాలని అనుకున్నప్పటికీ అంతగా కిక్ ఏమి ఇవ్వవు. ఇక కథలో ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని భావోద్వేగ సన్నివేశాలు ఉన్నాయి. స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు మాత్రం ప్రతీ ఎపిసోడ్ కు పర్ఫెక్ట్ టైమింగ్ ను సెట్ చేసుకున్నాడు. ఒక దాని తరువాత మరొక దానిపై హైప్ పెంచేలా ఎపిసోడ్స్ ఉంటాయి.

సెకండాఫ్ ఫస్ట్ లోనే కథ ఊపందుకుంది. పోస్ట్-ఇంటర్వెల్ సీక్వెన్స్ బ్యాంగ్‌తో సినిమా మరింత హైలెట్ అవుతుంది. కానీ అక్కడ కాస్త రొటీన్ సీన్స్ సినిమాకు మైనస్ గా మారాయి. ఇక ప్రత్యేకమైన పాత్రలో వచ్చిన మోహన్ లాల్ పెద్దగా స్కోప్ లేని సీన్స్ లోనే కనిపించారు. మిగతా మేజర్ క్యాస్ట్ చేసిన యాక్టర్స్ ఎప్పటిలాగే రొటీన్ రోల్స్ చేశారు. ఇక అనిరుద్ మరోసారి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో తలైవా స్టైల్ ను హైలెట్ చేశాడు. అతని మ్యూజిక్ పవర్ బిగ్ స్క్రీన్ పై మరింత హైలెట్ అయ్యింది. ఫైనల్ గా జైలర్ కథలో తలైవా వన్ మ్యాన్ షో హైలెట్ అయ్యింది. కాస్త ఎమోషన్స్, కాస్త డార్క్ కామెడీ, మరికొంత సూపర్ స్టార్ మార్క్ స్టైల్.. సినిమాను నిలబెట్టేలా చేశాయి. ఇక బాక్సాఫీస్ వద్ద క్లిక్ కావడానికి ఈ మాత్రం రజినీకాంత్ కు సరిపోతాయని చెప్పవచ్చు. 

ప్లస్ పాయింట్స్:
👉రజినీకాంత్ 
👉డార్క్ కామెడీ సీన్స్
👉అనిరుధ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్
👉ఫస్ట్ హాఫ్
👉కొన్ని రోటీన్ సీన్స్

రేటింగ్: 3/5

Post a Comment

Previous Post Next Post