తారక్ vs షార్క్.. నిజమైతే కిక్కే కిక్కు


జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో ఒక ప్రత్యేకమైన సెట్ లో కొనసాగుతోంది. VFX టీమ్ తో కలిసి దర్శకుడు కొరటాల శివ కొన్ని సముద్రానికి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సన్నివేశంలో ఉండే ఒక యాక్షన్ ఎపిసోడ్ కూడా చాలా హైలెట్ కాబోతుందట.

ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ షార్క్ మధ్యలో కూడా దర్శకుడు ఒక హై వోల్డేజ్ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సముద్రంలో ఒక భయంకరమైన షార్క్ ఎదురుపడితే హీరో దాన్ని ఎలా ఎదిరించాడు అనే సింపుల్ పాయింట్ తో కాకుండా దాని వెనుక ఒక బలమైన రీజన్ కూడా దర్శకుడు హైలెట్ చేయబోతున్నట్లు సమాచారం. ముందుగానే ఈ సీన్స్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా వర్క్ షాప్ కూడా నిర్వహించాడు. ఇక వీలైనంత త్వరగా ఈ సీన్స్ ను ఫినిష్ చేసి మరొక కీలకమైన షెడ్యూల్ ను మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. ఇక సినిమాను 2024 ఏప్రిల్ నెలలో విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.

Post a Comment

Previous Post Next Post