'గుంటూరు కారం' అప్డేట్ సిద్ధమే.. కానీ..


సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతి పుట్టినరోజు తన సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ అయితే ఇస్తూ వస్తున్నాడు. అయితే ఈసారి గుంటూరు కారం సినిమాకు సంబంధించి అప్డేట్ ఉంటుందా లేదా? అనే విషయంలో మాత్రం అసలు ఏమాత్రం క్లారిటీ రావడం లేదు. ఇప్పటివరకు హారిక హాసిని అలాగే తమన్ కూడా పెద్దగా స్పందించింది లేదు. ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా బిజినెస్ మెన్ అయితే రీ రిలీజ్ అవుతుంది.

కానీ గుంటూరు కారం అప్డేట్ ఉందా లేదా అనే విషయంలో మాత్రం ఇంతవరకు చిన్న సౌండ్ కూడా లేదు. అయితే తమన్ మాత్రం ఒక సాంగ్ అయితే రెడీ చేసి ఉంచాడట. అలాగే త్రివిక్రమ్ ఒక స్పెషల్ టీజర్ కూడా కట్ చేసి ఉంచినట్లుగా తెలుస్తోంది. స్పెషల్ గా సాంగ్ రిలీజ్ చేస్తేనే బాగుంటుంది అని అనుకుంటున్నారు. అయితే అంత సిద్ధంగానే ఉన్నప్పటికీ మహేష్ బాబు నుంచి ఇంకా ఎలాంటి అప్డేట్ లేదట. అందుకు కారణం కంటెంట్ అంతగా కనెక్ట్ కాలేదని టాక్ కూడా వస్తోంది. ప్రస్తుతం హాలిడేస్ లో విదేశాల్లో ఉన్న మహేష్ బాబు అక్కడే పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. అయితే మహేష్ ఏదో ఒక క్లారిటీ ఇస్తే కానీ పుట్టినరోజు నా అప్డేట్ వచ్చే అవకాశం అయితే లేదు. మరి బాబు త్రివిక్రమ్ టీమ్ కు ఏదైనా గుడ్ న్యూస్ చెబుతాడో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post