పుష్ప 2: వెయ్యి కోట్ల ఆశలకు దారులు..!


అల్లు అర్జున్ జాతీయ అవార్డు గెలుచుకున్నప్పటి నుండి, పుష్ప 2 చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.  ప్రస్తుతం షూటింగ్ పనులను వేగంగా ఫినిష్ చేసుకుంటున్న ఈ సినిమా 2024 వేసవిలో విడుదల కానుంది. ఇక ఈ చిత్రం ప్రత్యేక హక్కుల కోసం ఒక ప్రముఖ నార్త్ ఇండియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ 1000 కోట్ల డీల్ ఆఫర్ చేసిందనేది ప్రస్తుతం వినిపిస్తున్న టాక్.  

ఈ వార్త పుష్ప 2 చుట్టూ ఉన్న విపరీతమైన హైప్‌ని క్రియేట్ చేస్తోంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇంకా ఎలాంటి ఒప్పందాలను ఖరారు చేయలేదు. బిడ్డింగ్ వార్‌లోకి ప్రవేశించడానికి ఇంకా పెద్ద డీల్స్ కోసం వేచి ఉన్నట్లు కనిపిస్తోంది. పాన్-ఇండియా రేంజ్ లో పుష్ప 2 బడ్జెట్ 400 కోట్లకు చేరే ఛాన్స్ ఉందట. నేషనల్ అవార్డ్ రాకముందే సినిమా మార్కెట్ లో 700 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసే అవకాశం కనిపించింది. ఇక నేషనల్ అవార్డ్ రావడంతో 1000 కోట్ల ఆశాలకు దారులు దొరికాయి.

Post a Comment

Previous Post Next Post