ఖుషి.. నష్టాలు తప్పేలా లేవు?


ఖుషి మొదట విడుదలైన రోజు పాజిటివ్ టాక్ అందుకున్న విషయం తెలిసిందే. రివ్యూలు కూడా చాలా వరకు పాజిటివ్ గానే వచ్చాయి. దీంతో తప్పకుండా సినిమా మొదటి వీక్ లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఫినిష్ చేస్తుంది అని అనుకున్నారు. కానీ సోమవారం రోజు ఈ సినిమా కలెక్షన్స్ ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఓవర్సీస్ లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే పూర్తయింది. అలాగే నైజాంలో కూడా దాదాపు పెట్టిన పెట్టుబడి వెబక్కి వచ్చే అవకాశం ఉన్నట్లయితే కనిపిస్తోంది.

అయితే మిగతా ఆంధ్ర సీడెడ్ లో మాత్రం ఈ సినిమా కాస్త ఎక్కువగానే నష్టాలు చూసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆదివారం రోజు యూనిట్ ప్రమోషన్స్ అయితే బాగానే చేసింది. సోమవారం రోజు కూడా విజయ్ దేవరకొండ కోటి రూపాయల దానం చేయబోతున్నట్లు ఆఫర్ ఇవ్వడంతో సినిమాపై కొంత ఫోకస్ ఎక్కువగా పెరిగింది. అయినప్పటికీ సినిమా కలెక్షన్స్ అయితే ఈ రోజు కూడా ఊహించని స్థాయిలో తగ్గే అవకాశం ఉంది. సినిమా నిడివి కాస్త ఎక్కువైంది అని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. దాన్ని సరిచేస్తే బెటర్ అయ్యి ఉండేదేమో. మొత్తానికి నిర్మాతలు అయితే సేఫ్ జోన్ లోనే పడ్డారు. కానీ థియేట్రికల్ గా మాత్రం విజయ్ మార్కెట్ పై కొంత ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది.

Post a Comment

Previous Post Next Post