చంద్రముఖి 2: సాయి పల్లవి ఎందుకు రిజెక్ట్ చేసిందంటే?


చంద్రముఖి క్యారెక్టర్ కు ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు జ్యోతిక ఆ పాత్రలో లీనమై నటించిన విధానం ఎన్నిసార్లు చూసినా కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. ఆమెకు జీవితాంతం సరిపోయేంత గుర్తింపును ఆ క్యారెక్టర్ తీసుకు వచ్చింది. అయితే అలాంటి క్లాసిక్ క్యారెక్టర్ ను ఎవరు చేస్తారో అనే విషయంలో మొదట బాగానే చర్చ నడిచింది.

ఇక కంగనా రనౌత్ చంద్రముఖి 2 పాత్రలో నటించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఫస్ట్ లుక్ వచ్చినప్పటి నుంచి కొంత ఈ సినిమాకు నెగిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. ట్రైలర్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. అయితే సాయి పల్లవి మొదట చంద్రముఖి 2 పాత్ర కోసం అనుకున్నారు. కానీ ఆమె పాత్ర విధానం నచ్చకనే రిజెక్ట్ చేసింది.

దర్శకుడు పీ.వాసు అప్పటి తరహాలోనే సినిమా కంటెంట్ ను హైలెట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే సాయి పల్లవి కి కొత్తగా అనిపించకపోవడం జ్యోతిక తరహాలో న్యాయం చేయలేను అని చాలా బాగా ఆలోచించి వెనుకడుగు వేసింది. ఇక ఇప్పుడు కాంగనా ను చూస్తూ ఉంటే సినిమా విడుదల తర్వాత బాగా ట్రోలింగ్ కు గురయ్యే అవకాశం ఉన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి. మరి చంద్రముఖి 2 అందుకు భిన్నమైన టాక్ అందుకుంటుందో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post