బేబీ వైష్ణవి.. బంగారం లాంటి ఛాన్సులు!


బేబీ సినిమాతో బాక్సాఫీస్ వద్ద హీరోయిన్ గా మంచి సక్సెస్ చూసిన వైష్ణవి చైతన్య నెక్స్ట్ ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లు చేసుకుంటూ వచ్చిన అమ్మడు ఇప్పుడు హీరోయిన్గా మొదట్లోనే బోల్డ్ క్యారెక్టర్ ను సెలెక్ట్ చేసుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఆమె తీసుకున్న బోల్డ్ నిర్ణయానికి తగిన ఫలితం దక్కింది.

ఇక వైష్ణవి చైతన్య నెక్స్ట్ ఎలాంటి పాత్రలు సెలెక్ట్ చేసుకుంటుంది అనే విషయం కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది. రీసెంట్గా అయితే ఆమె పూరి జగన్నాధ్ రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ సినిమాలో అవకాశం అందుకున్నట్లుగా టాక్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ కి రెండు గోల్డెన్ ఛాన్సులు దక్కినట్లుగా తెలుస్తోంది.

 దిల్ రాజు ప్రొడక్షన్లో ఆమె ఒక సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఆయన సోదరుడి కొడుకు ఆశిష్ చేయబోతున్న కొత్త సినిమా కోసం ఈ బ్యూటీని సంప్రదించినట్లు తెలుస్తోంది. అలాగే మరోవైపు సిద్దు జొన్నలగడ్డ బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ సినిమాకు కూడా వైష్ణవి సెలెక్ట్ అయినట్లు సమాచారం. ఈ రెండు సినిమాలు సక్సెస్ అయితే మాత్రం ఈ బ్యూటీ ఇండస్ట్రీలో మరో లెవల్ కి వెళ్లే అవకాశం ఉంటుంది.

Post a Comment

Previous Post Next Post