ఖుషి మూవీ - రివ్యూ & రేటింగ్


కథ:
ఉద్యోగారిత్య విప్లవ్ (విజయ్ దేవరకొండ) కాశ్మీర్‌ కు వెళ్లగా అక్కడ ముస్లింగా ఉన్న ఆరాధ్య (సమంత)ను చూడగానే ప్రేమలో పడతాడు. కానీ తరువాత ఆమె బ్రాహ్మణ అమ్మాయి అని తెలుస్తుంది. ఇక ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. విప్లవ్ ఒక ప్రముఖ నాస్తికుడు లెనిన్ సత్యం (సచిన్ ఖేడ్కర్) కుమారుడు. ఆరాధ్య అతని ప్రధాన ప్రత్యర్థి ప్రముఖ ప్రవచనకర్త చదరంగం శ్రీనివాసరావు (మురళీ శర్మ) కుమార్తె. ఇక పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అనుకున్న వారి వివాహం దాదాపు అసాధ్యం అని వారు తర్వాత గ్రహిస్తారు. ఇక పెద్దలకు ఇష్టం లేకున్నా విప్లవ్ ఆరాధ్య ఎలా పెళ్లి చేసుకుంటారు, వారి వైవాహిక జీవితంలో ఏం జరుగుతుంది అనేదే ఖుషిలో మిగతా కథ

విశ్లేషణ:
దర్శకుడు శివ నిర్వాణ మొదట ప్రేమకథలతోనే ఎక్కువగా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. నిన్ను కోరి మజిలీ రెండు కూడా లవ్ ఫెయిల్యూర్ టచ్ ఉన్నప్పటికీ మంచి ఎమోషన్ ను హైలెట్ చేసి సరి కొత్తగా ప్రజెంట్ చేశాడు శివ. ఇక మొదట్లో అతను ఎంచుకున్న కథలు మాత్రం చాలా విభిన్నంగా ఉన్నవే. కానీ ఇప్పుడు ఖుషి కథ విషయానికి వస్తే మాత్రం చాలా రొటీన్ పాయింట్ తోనే తెరపైకి వచ్చింది. కథ విషయంలో పెద్దగా ఆశ్చర్యానికి గురి అయ్యే అంశాలు ఏమీ లేవు. కాకపోతే దర్శకుడు తన అనుకున్న పాయింట్ ను వీలైనంత కొత్త తరహాలో తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు. 

మొదట్లోనే కథకు సంబంధించిన బీజాన్ని దర్శకుడు చాలా సింపుల్ గానే ప్రజెంట్ చేశాడు. వారు ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటే అసలు ఏ మాత్రం బాగుండదు అని సుఖంగా ఉండలేరు అని గండం ఉంది అంటూ కొన్ని పాయింట్స్ ను హైలెట్ చేశారు. ఆ తర్వాత ఆ పెద్దలకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకొని ఇలాంటి జంట ఈ ప్రపంచంలోనే ఉండదు అని నిరూపిద్దాం అంటూ హీరో హీరోయిన్ సరికొత్త జీవితాన్ని మొదలుపెట్టే విధంగా స్క్రీన్ ప్లే కొనసాగుతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ లో దర్శకుడు ప్రేమ కథలో మొదలుపెట్టిన విధానం దానికి తోడు మ్యూజిక్ కూడా ప్రేక్షకులకు ఒక మంచి ఫీల్ అయితే కలిగిస్తూ ఉంటుంది.

ముఖ్యంగా విజువల్స్ ఈ సినిమాకు ప్రధాన ఆయువు అని చెప్పవచ్చు. కాశ్మీర్ అందాలకు హెషమ్ మ్యూజిక్ తోడు కావడంతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కామెడీ లవ్ ట్రాక్స్ ఇలా ఫస్ట్ అఫ్ మొత్తం కూడా అలా సాగుతూ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో మాత్రం దర్శకుడు ప్రేమ జంట మధ్యలో గొడవలను హైలైట్ చేసే ప్రయత్నం చేశాడు. మొదట చాలా ఆనందంగా మొదలైన వారి ప్రయాణం ఆ తర్వాత కొన్ని కొన్ని చిన్న చిన్న అపోహలతో అలాగే అలకలతో ఊహించని సీరియస్ నోట్ కు దారితీస్తుంది. 

ఇక అలాంటి సమయంలో హీరో హీరోయిన్ మధ్య ఉంటే ఎమోషన్ బాండింగ్ కూడా దర్శకుడు చాలా బాగానే హ్యాండిల్ చేశాడు. పెద్దగా ట్విస్టులు లేకుండా సినిమా అయితే అలా సాగిపోతూ ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ లో లాగ్ అనిపించిన భావన కూడా కలుగుతుంది. ఫస్ట్ ఆఫ్ లో కూడా అక్కడక్కడ కొన్ని బోరింగ్ తెప్పించే సన్నివేశాలు ఉన్నాయి. కానీ దర్శకుడు సెకండ్ హాఫ్ లో మరింత ఆకట్టుకునే సన్నివేశాలను హైలైట్ చేశాడు. ఇక చివరలో ఎప్పటిలానే దర్శకుడు హడావిడి లేకుండా రెగ్యులర్ క్లైమాక్స్ తో ముగించాడు. ఇక ఈ సినిమాలో మేజర్ గా కెమెరా వర్క్ చాలా హైలెట్. ఇక మ్యూజిక్ కూడా సినిమా మూడ్ ను బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళింది. దర్శకుడు శివ ఈసారి ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించే సీన్స్ ను గట్టిగానే హైలెట్ చేశాడు. మొత్తానికి అయితే పెద్దగా అంచనాలు లేకుండా చూడగలిగితే సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు కనక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఖుషి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి.

ప్లస్ పాయింట్స్:
👉హీరో హీరోయిన్
👉మ్యూజిక్
👉కామెడీ, లవ్ ట్రాక్

మైనస్ పాయింట్స్:
👉రొటీన్ స్టోరీ
👉కొన్ని ల్యాగ్ సీన్స్

రేటింగ్: 3/5

Post a Comment

Previous Post Next Post