సలార్ రిలీజ్ వాయిదా.. అసలు రీజన్ ఏంటి?


సెప్టెంబర్ నెలలోకి అడుగుపెట్టగానే సలార్ అప్డేట్స్ తో హడావిడి మొదలవుతుంది అని అందరూ ఫాన్స్ కూడా ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ ఇప్పుడు అప్డేట్స్ కాదు కదా ఏకంగా సినిమా రిలీజ్ విషయంలోనే ట్విస్ట్ ఇవ్వబోతున్నారు అంటూ ఊహించని గాసిప్స్ అయితే ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి. సలార్ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన రాకపోవచ్చు అని ఈ ఏడాది డిసెంబర్లో లేదా నెక్స్ట్ సంక్రాంతి కి సినిమాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా చాలా రకాల పుకార్లు ఫ్యాన్స్ కు అయితే చిరాకు తెప్పిస్తున్నాయి.

అయితే అసలు కారణం ఏమిటి అనే విషయంలో కూడా కొన్ని గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా ఔట్ ఫుట్ విషయంలో కాస్త కన్ఫ్యూజల్ లో ఉన్న దర్శకుడు ప్రశాంత్ మళ్ళి ఎడిటింగ్ వర్క్ కోసం కూర్చున్నట్లుగా తెలుస్తోంది. ఇక నిర్మాతలు ముందుగానే డిస్ట్రిబ్యూటర్స్ కు కూడా సమాచారం ఇచ్చినట్లుగా టాక్ కూడా వినిపిస్తోంది. 

అలాగే సినిమాలో ఒక ఐటెం సాంగ్ కూడా ఉండాలి అని దర్శకుడు ఆలోచించాడట. ప్రస్తుతం ప్రభాస్ కాలినొప్పితో ఉండడంతో ఆ సాంగ్ షూట్ చేసే అవకాశం లేదు అని కూడా కథనాలు వెలువడుతున్నాయి. అందుకే ప్రభాస్ కాస్త ఫ్రీ అయిన తర్వాత సాంగ్ షూట్ ను పూర్తి చేసి సరికొత్త ప్రమోషన్స్ తో సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు సిజి వర్క్ కోసం దర్శకుడు మరికొంత సమయం అడిగినట్లుగా కూడా తెలుస్తోంది. అసలు కారణమైతే ఈ సీజీ వర్క్ అనే తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలంటే అఫీషియల్ క్లారిటీ ఇవ్వాల్సిందే.

Post a Comment

Previous Post Next Post