భక్త కన్నప్ప.. ప్రభాస్ ఒప్పుకోవడానికి అసలు కారణం?


మంచు విష్ణు "కన్నప్ప"తో  ఎలాగైనా బిగ్ సక్సెస్ అందుకోవాలని  సిద్ధంగా ఉన్నాడు. ఇక ప్రభాస్ ఈ ప్రాజెక్ట్‌లో చేరుతున్నట్లు ఇటీవల ప్రకటించడంతో అంచనాల స్థాయి మరింత పెరిగింది.  ఇతిహాసం "మహా భారతం" సిరీస్‌ల కథల కు ప్రసిద్ది చెందిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న "కన్నప్ప" తప్పకుండా విష్ణు కెరీర్ కు ఒక బూస్ట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రలో నటిస్తున్నారు. అయితే ప్రభాస్ ఈ ప్రాజెక్టులో నటించడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా మంచు మోహన్ బాబుతో ఆయనకు మంచి సాన్నిహిత్యం అయితే ఉంది. వీరిద్దరూ కలిసి బుజ్జిగాడు సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక విష్ణుతో కూడా ప్రభాస్ కు మంచి బాండింగ్ అయితే ఉంది. 

ఇక అన్నిటికంటే ముఖ్య కారణం ఈ సినిమాను దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తూ ఉండడం విశేషం. ఆయన ఇలాంటి కథలను తప్పకుండా పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయగలడని శివుడి పాత్ర చేయడానికి ప్రభాస్ సిగ్నల్ ఇచ్చాడు. దాదాపు 90 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కాబట్టి స్పెషల్ రోల్ చేస్తే సినిమాకు తప్పకుండా హెల్ప్ అవుతుంది అని తనకు కూడా చాలా కొత్తగా ఉంటుంది అని ప్రభాస్ ఈ పాత్ర చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post