గేమ్ ఛేంజర్.. ఇంకెంత లాగుతారో?


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తదుపరి సినిమా గేమ్ ఛేంజర్ రిలీజ్ విషయంలో సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. దర్శకుడు శంకర్ ఈ సినిమాను ఏడాదిలోపే ఫినిష్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నాడు. దిల్ రాజు కూడా పక్కా ప్రణాళికతోనే శంకర్ తో అగ్రిమెంట్ చేసుకుని మరి సినిమాను స్టార్ట్ చేశాడు. కానీ శంకర్ ఇండియన్ 2 సినిమా మళ్లీ లైన్లోకి రావడంతో ప్లాన్లు ఒక్కసారిగా ఛేంజ్ అయిపోయాయి.

ఇక ఇండియన్ 2 సినిమా రిలీజ్ అయితే గాని గేమ్ ఛేంజర్ సినిమా డేట్ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం లేకుండా పోయింది. రీసెంట్ గా ఇండియన్ 2 నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ శంకర్ తో చర్చలు జరిపి సినిమాను వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల చేసుకుంటే బెటర్ అని ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక అదే అంత ఆలస్యమైతే గేమ్ ఛేంజర్ వచ్చేసరికి మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. 

ఈ గజిబిజిలో అసలు శంకర్ క్వాలిటీతో సినిమా చేస్తున్నాడా లేదా అనే విషయం కూడా ఫ్యాన్స్ లో కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది. ఇక గేమ్ ఛేంజర్ సినిమా 2023 సమ్మర్ కు వస్తుంది అని నమ్మకమైతే సన్నగిల్లుతోంది . ఇండియన్ 2 ఆగస్టులో అంటే గేమ్ ఛేంజర్ సినిమా 2024 చివర్లోనే ఉండవచ్చు అని మళ్లీ కొత్త తరహా డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి. మరి ఈ విషయంలో నిర్మాత దిల్ రాజు ఏదైనా క్లారిటీ ఇస్తాడో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post