కలెక్షన్స్ షాక్.. ఖుషి కూడా దెబ్బెసింది..!


విజయ్ దేవరకొండ ఖుషి సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో హడావిడి చేసి బాగానే విడుదల చేశారు. అయితే ఈ సినిమా తెలుగులో తప్పితే మిగతా భాషల్లో అసలు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో లైగర్ సినిమా కలెక్షన్స్ బ్రేక్ చేసిన ఈ సినిమా మిగతా భాషల్లో మాత్రం విజయ్ ఇంతకుముందు సినిమాల కంటే చాలా తక్కువ కలెక్షన్స్ రాబట్టింది.

పాన్ ఇండియా మార్కెట్లో స్థానం సంపాదించుకోవాలి అని చూస్తున్నా విజయ్ డియర్ కామ్రేడ్ లైగర్ సినిమాలతో బాగానే ప్రయత్నాలు చేశాడు. కానీ ఆ రెండు సినిమాలు డివైడ్ టాక్ అందుకోవడం తో ఇప్పుడు ఖుషి పై మరింత ప్రభావం చూపించింది. విజయ్ ను ఈసారి నార్త్ ఆడియన్స్ అయితే అసలు ఏమాత్రం పట్టించుకోలేదు. మిగతా భాషల నుంచి ఖుషి సినిమా కనీసం 50 లక్షల షేర్ కూడా అందుకోలేకపోయింది. దీన్ని బట్టి సినిమా కంటెంట్ అన్ని భాషల వారికి కూడా కనెక్ట్ అయ్యేలా ఉంటేనే పాన్ ఇండియా రిలీజ్ చేసుకుంటే బెటర్. లేదంటే మళ్ళీ నెక్స్ట్ సినిమా మార్కెట్ పై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

Post a Comment

Previous Post Next Post