అట్లీ.. అల్లు అర్జున్ ఆగింది అందుకే..?


అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు అని గత కొన్ని రోజులుగా సౌత్ ఇండియాలో అనేక రకాల వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. అసలైతే ముందుగా అట్లీ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ ఇప్పట్లో ఎన్టీఆర్ డేట్స్ దొరికే అవకాశం అయితే లేదు. అల్లు అర్జున్ కూడా పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు. అలాగే లిస్టులో సందీప్ రెడ్డి వంగ కూడా ఉన్నాడు.

కాబట్టి అతను కూడా దొరకడం కష్టమే కానీ త్రివిక్రమ్ ప్రాజెక్టు జెట్ స్పీడ్ లో ముగిస్తే అట్లీ కి ఛాన్స్ దొరికే అవకాశం అయితే ఉంది. అందుకే అతని ఫోకస్ ఐకాన్ స్టార్ పై పడింది. అయితే అల్లు అర్జున్ మాత్రం ఈ జవాన్ దర్శకుడిని కాస్త హోల్డ్ లోనే పెట్టినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే జవాన్ సినిమా ఇప్పుడు అట్లీ కి చాలా ముఖ్యం కానుంది. కమర్షియల్ దర్శకుడిగా పాత కథలను అటు ఇటుగా తిప్పే అట్లీ మీద అప్పుడప్పుడు అంచనాలు విభిన్నంగా ఉంటాయి. కాబట్టి జవాన్ సినిమా సక్సెస్ అయితేనే అల్లు అర్జున్ అతనితో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. మరి ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post