సినిమాలతో భారీ ఆదాయాన్ని పెంచుకుంటున్న చిన్నారి


విక్రమ్ నటించిన దైవ తిరుమగల్ (తెలుగులో నాన్న) సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక ఈ సినిమాలో హీరో కూతురుగా నటించిన ఆ పాపను ఎవరు అంత ఇజీగా మర్చిపోలేరు. విక్రమ్ తో పాటు నటనతో ఈ చిన్నారి ఎంతగానో అట్రాక్ట్ చేసింది. అయితే ఇప్పుడు ఆమె వయసు 17 ఏళ్లకు చేరుకుంది. ప్రస్తుతం బిజీ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న సారా అర్జున్ అత్యధిక పారితోషకం అందుకుంటున్న బాలనాటిగా కూడా గుర్తింపును అందుకుంటుంది.

ఇప్పటివరకు ఆమె బాల నటిగా ఎంత ఆదాయాన్ని అందుకుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.  ప్రఖ్యాత నటుడు రాజ్ అర్జున్ కుమార్తె సారా అర్జున్ 17 సంవత్సరాల వయస్సులో అద్భుతమైన విజయాలతో స్టార్ కిడ్‌గా కొనసాగుతోంది. "జై హో"లో సల్మాన్ ఖాన్, "ఏక్ థీ దాయాన్"లో ఇమ్రాన్ హష్మీ  "జజ్బా" "సూపర్ స్టార్స్"లో ఐశ్వర్యరాయ్ వంటి ప్రముఖ తారలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. 

సారా తెలుగు మలయాళ సినిమాలలో తనదైన ముద్ర వేసింది. "పొన్నియిన్ సెల్వన్ పార్ట్-1"లో యువ నందిని (ఐశ్వర్యరాయ్ పోషించిన) పాత్రలో అద్భుతంగా నటించింది. ఇక భారతదేశపు అత్యంత ప్రతిభావంతులైన బాల నటీమణులలో ఒకరిగా ఆమె హోదాను సుస్థిరం చేసింది. 2023 నాటికి, సారా దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే బాలనటిగా రికార్డ్ సాధించింది. ఇప్పటివరకు ఆమె సంపాదన రూ.  10 కోట్లు దాటినట్లు సమాచారం. ఇక విజయ్ రాబోయే ప్రాజెక్ట్ "దళపతి"లో సారా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post