స్టార్ హీరో సినిమాలో నరేష్.. రెమ్యునరేషన్ తక్కువే..?


కమెడి హీరో గా చాలా రకాల సినిమాలు చేసిన అల్లరి నరేష్ ఇప్పుడు ఒకే ఫార్మాట్లో వెళ్లకుండా డిఫరెంట్ కంటెంట్ ఉన్న కథలను కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అయితే నాంది సినిమా తర్వాత మళ్లీ అతను స్లోడౌన్ అయ్యాడు. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద అంతగా సక్సెస్ కాలేకపోయాయి. అయితే ప్రస్తుతం సభకు నమస్కారం అనే మరొక సినిమా చేస్తున్నాడు.

అలాగే మరో స్టార్ హీరో సినిమాలో కూడా స్పెషల్ పాత్రలో నటించబోతున్నట్లు చాలా కాలంగా టాక్ అయితే వినిపిస్తోంది. తనకు చాలా ఇష్టమైన హీరో నాగార్జున అని చాలాసార్లు నరేష్ చెప్పాడు. అయితే ఇప్పుడు ఆ హీరో చేస్తున్న 'నా సామిరంగా' సినిమాలోనే నరేష్ స్పెషల్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఆ పాత్ర కోసం నరేష్ రెమ్యునరేషన్ కూడా కోటి కంటే తక్కువగానే ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రతి సినిమాకు రెండు కోట్లకు అటు ఇటుగా తీసుకుంటున్నా నరేష్ ఇప్పుడు స్పెషల్ పాత్రకు మాత్రం  అంతకంటే తక్కువే అందుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరి ఆ పాత్ర అతని కెరీర్ కు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. గతంలో మహర్షి సినిమాలో అతను స్పెషల్ పాత్రలో చేశాడు కానీ అదేమీ అంతగా హెల్ప్ చేయలేదు.

Post a Comment

Previous Post Next Post