రాజమౌళి తరువాత మహేష్ ప్రాజెక్ట్ అతనితోనే.. ఫిక్స్?


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు అయితే ఈ ఏడాది చివరిలోనే స్టార్ట్ కావాలి. కానీ ఓవైపు రాజమౌళి స్క్రిప్ట్ పనుల్లో మరి కొంత సమయం తీసుకోగా మరోవైపు త్రివిక్రమ్ ప్రాజెక్టు విషయంలో కూడా మహేష్ కాస్త ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. ఇక మొత్తానికి మహేష్ రాజమౌళి కాంబినేషన్ 2024 ఫిబ్రవరి లేదా మార్చి ప్రారంభంలోనే పట్టాలు ఎక్కే అవకాశం ఉంది.

అయితే మహేష్ ఈ ప్రాజెక్టు తర్వాత అతని క్రేజ్ తప్పకుండా మరో లెవెల్ కు వెళుతుంది అని చెప్పవచ్చు. కానీ ఆ తర్వాత అతను ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు అనే విషయంలో అయితే ఇంకా క్లారిటీ రాలేదు. కానీ లేటెస్ట్ గా అందిన లీక్ ప్రకారం అయితే మహేష్ ఆ తర్వాత కాంబో కూడా ఫిక్స్ అయినట్లే అని తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగ మహేష్ బాబు కాంబినేషన్ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం సందీప్ యానిమల్ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తుండగా ఆ తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ అల్లు అర్జున్తో మరో ప్రాజెక్టును తెరపైకి తీసుకురావాలని అనుకుంటున్నాడు. అయితే దాని తర్వాత మహేష్ బాబుతో కూడా అతను సినిమా చేయడానికి ఒక స్టోరీని అయితే ఫిక్స్ చేసుకున్నాడు. ఇక ఈ వరుస హిట్స్ పడితే మాత్రం మహేష్ డౌట్స్ లేకుండా అతనికే అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది.

Post a Comment

Previous Post Next Post