గుంటూరు కారం లీక్స్.. నువ్వు కూడా అదేనా గురూజీ?


సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ ఈ మధ్యకాలంలో గ్యాప్ లేకుండా కొనసాగుతోంది. వీలైనంత తొందరగా సినిమా షూట్ ఈ ఏడాది నవంబర్ లోపు ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల లీక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక లేటెస్ట్ గా హైదరాబాద్ యూనివర్సిటీ ఉమెన్స్ కాలేజీలో జరిగిన షూటింగ్ కు సంబంధించిన కొన్ని విజువల్స్ అయితే లీక్ అయ్యాయి.

అయితే అందులో కోర్టుకు సంబంధించిన సీన్స్ షూట్ చేసినట్లుగా టాక్ అయితే వస్తోంది. దీంతో సోషల్ మీడియాలో ఫాన్స్ నుంచి భిన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇందులో కూడా మెసేజ్ ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మరోసారి మహేష్ బాబు సినిమాలో మెసేజ్ చూడాలని ఆసక్తి లేదు అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. కానీ ఏదో ఒక మంచి విషయాన్ని పర్ఫెక్ట్ గా చూపిస్తే మాత్రం అందరూ యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. త్రివిక్రమ్ తన సినిమాల్లో ఎక్కువగా కమర్షియల్ యాంగిల్ లోనే మంచి విలువలున్న సీన్స్ ను హైలెట్  చేస్తాడు అని తెలిసిందే. కాబట్టి ఈసారి మహేష్ తో తనదైన శైలిలో ఏదైనా మెసేజ్ ఇస్తాడా అనే సందేహం కలుగుతుంది. చూడాలి మరి ఎలా ఉంటుందో.

Post a Comment

Previous Post Next Post