మైత్రికి కొండన్న దెబ్బ మీద దెబ్బ!


విజయ్ దేవరకొండ మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్ ఖుషి సినిమాతో ఎలాగైనా మంచి సక్సెస్ అందుకునీ ట్రాక్లోకి రావాలని అనుకున్నారు. ఇదివరకే వీరి కలయికలో రెండుసార్లు దారుణంగా నష్టాలు వచ్చాయి. మొదట విజయ్ తో డియర్ కామ్రేడ్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఖర్చుకు వెనకాడకుండా తెరపైకి తీసుకు వచ్చింది. కొత్త దర్శకుడు పై నమ్మకంతో విజయ్ కాన్ఫిడెంట్ చూసి ఆ సినిమాకు పాన్ ఇండియా రేంజ్ లో భారీగానే ఖర్చు చేశారు. కానీ సినిమా కంటెంట్ ఓవర్గం వారిని బాగానే ఆకట్టుకున్నప్పటికీ కమర్షియల్ గా మాత్రం నష్టాలు తప్పలేదు.

ఇక తర్వాత మైత్రి మూవీ మేకర్స్ తో విజయ్ హీరో అనే ఒక సినిమాను మొదలు పెట్టారు. రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో ఆ సినిమాలో పెద్దగా హడావిడి లేకుండానే మొదలుపెట్టారు. ఇక కోట్లు ఖర్చు చేసి ఒక షెడ్యూల్ పూర్తి చేసిన తర్వాత గాని వారికి అర్థం కాలేదు.. సినిమా కంటెంట్ ఏదో తేడాగా ఉంది అని. డౌట్ వచ్చి ఈ నష్టం తోనే తప్పించుకుంటే బెటర్ అని అక్కడితో ప్రాజెక్టును ఆపేశారు. 

ఇక ఆ తర్వాత విజయ్ మరో సినిమాను వాళ్ళతోనే చేసేందుకు ఒప్పుకున్నాడు. ఇక మైత్రి వాళ్ళు శివ నిర్వాణకు కెరీర్ లోనే బెస్ట్ రెమ్యూనరేషన్ ఇచ్చి మరి ఖుషి కథను సిద్ధం చేయించారు. ఇక సమంతకు కూడా గట్టిగానే రెమ్యునరేషన్ ఇచ్చారు. సినిమా మేకింగ్ కోసం కూడా ఏమాత్రం వెనుకడుగు  వేయకుండా నిర్మించారు. కానీ సినిమా ఓవర్సీస్ లో తప్పితే ఎక్కడ కూడా లాభాలు తెచ్చిపెట్టలేదు. ముఖ్యంగా ఆంధ్రలో అయితే దారుణమైన నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ విధంగా మైత్రి మూవీ మేకర్స్ తో ప్రతిసారి విజయ్ దేవరకొండ వల్ల చేదు అనుభవాలే మిగిలాయి. ఇక సుకుమార్ తో విజయ్ ఒక సినిమా ఉంటుందని అప్పట్లో ఎనౌన్స్ చేశారు. మరి ఆ ప్రాజెక్ట్ మైత్రితో సెట్టవుతుందో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post