ప్రభాస్ ఇది న్యాయమా?.. ఏది పర్ఫెక్ట్ గా లేదు!


ప్రభాస్ సినిమా వస్తోంది అంటే ఫ్యాన్స్ లో అంచనాలు ఏ స్థాయిలో పెరిగిపోతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ బాహుబలి తర్వాత మాత్రం ప్రతి ప్రాజెక్టు విషయంలో కూడా ప్రభాస్ ఊహించని విధంగా కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేస్తున్నాడు. చిన్న సినిమా చేసినా అదే పరిస్థితి పెద్ద సినిమా చేసిన కూడా అదే సమస్య అన్నట్లుగా కొనసాగుతోంది. ప్రభాస్ ఇది తెలియక చేస్తున్నాడా లేక దర్శకులలోపమా ఇంకా మరేదైనా బ్యాడ్ లక్కా అనేది అంతు చిక్కిన విషయంగా మారింది.

ఈ విషయాన్ని పక్కన పెడితే మాత్రం దాదాపు రెండు వేల కోట్ల మార్కెట్ చూసిన హీరో మినిమమ్ కెరీర్ ప్లాన్ చేసుకోకపోవడం అయితే కొంత ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ప్రభాస్ సాహో రాధే శ్యామ్ సినిమాలు అనుకున్న సమయానికి విడుదల కాలేదు. పైగా ఫలితం కూడా తేడా కొట్టేసింది. ఇక ఆదిపురుష్ ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది కూడా చాలాసార్లు వాయిదా పడింది.

ఇక ఇప్పుడైనా సలార్ తో  కావలసినంత మాస్ కిక్ ఇస్తాడు అనుకుంటే మళ్ళీ కథ మొదటికే వచ్చింది. ఈ సినిమా టీజర్ సరిగ్గా విడుదల చేయలేదు. కనీసం పోస్టర్లు కూడా వరదలడం లేదు. దీంతోపాటు సినిమాను మళ్ళీ వాయిదా వేయడం చాలా చిరాకు తెప్పించింది. ఇక ప్రాజెక్టుK  వచ్చే సమ్మర్ కి వస్తుందా రాదా అనే విషయంలో కూడా క్లారిటీ లేదు.  

ఇక లిస్టులో ఉన్న మారుతి సినిమా అసలు ఇప్పటివరకు అఫీషియల్ గా ప్రకటించలేదు. ఎంతవరకు షూటింగ్ జరిగిందో కూడా క్లారిటీగా చెప్పలేదు. స్పిరిట్ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. ఇక మొత్తానికి అయితే ప్రభాస్ కెరియర్ లో ప్రతి ప్రాజెక్టు కూడా సాఫీగా థియేటర్లలోకి రావడం లేదు. పైగా ఫలితాలు కూడా తేడా కొట్టేస్తున్నాయి. మరి ఈ తరహా సెంటిమెంట్ ను ప్రభాస్ ఎప్పుడు బ్రేక్ చేస్తాడో చూడాలి.

Post a Comment

Previous Post Next Post